Mon Dec 23 2024 05:46:13 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: హైకోర్టులో అశోక్ కు చుక్కెదురు
డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తనపై కేసును కొట్టివేయాలని అశోక్ హైకోర్టులో [more]
డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తనపై కేసును కొట్టివేయాలని అశోక్ హైకోర్టులో [more]
డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తనపై కేసును కొట్టివేయాలని అశోక్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్ పై ఇవాళ కోర్టు విచారణ జరిపింది. తమ క్లయింట్ అశోక్ కు ఈ కేసులో సంబంధం లేదని, ఏపీలో జరిగిన వ్యవహారం కాబట్టి ఏపీ పోలీసులే ఈ కేసును విచారించాలని అశోక్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. అశోక్ తరపున న్యాయవాది వాదనతో ఏకీభవించని కోర్టు కచ్చితంగా పోలీసుల నోటీసులకు వివరణ ఇవ్వాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
Next Story