తాజ్ మహల్ లోని 22 భూగర్భ గదుల చిత్రాలను విడుదల చేసిన ఏఎస్ఐ
అయోధ్యకు చెందిన డాక్టర్ రజనీష్ సింగ్ అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్‌లో తాజ్ మహల్లో మూసి..
న్యూఢిల్లీ : ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశం తాజ్ మహల్ చుట్టూ ఎన్నో వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే..! ఒకానొక దశలో తాజ్ మహల్ షాజహాన్ కట్టించింది కాదని.. అదొక ఆలయం అంటూ కూడా వాదనలు వినిపించాయి. ఇక తాజ్ మహల్ నేలమాళిగలో 22 తాళం వేసిన గదులు ఉన్నాయని.. అందుకు సంబంధించి విస్తృతమైన చర్చ కొనసాగుతూ ఉంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఈ గదుల లోపల పునరుద్ధరణ పనులను విడుదల చేపట్టింది. జనవరి 2022 లో న్యూస్ లెటర్ ఆధారంగా.. ASI వెబ్సైట్లో అందుకు సంబంధించిన కొన్ని చిత్రాలను ఉంచారు. ఎవరైనా తమ వెబ్సైట్ లో ఆ ఫోటోలను వీక్షించవచ్చని ఆగ్రా ASI చీఫ్ RK పటేల్ తెలిపారు. పలు నిర్వహణ పనులు చేపట్టగా.. వారికి సంబంధించిన చిత్రాలను సైతం విడుదల చేశారు అధికారులు. నదీ తీరంలో భూగర్భ గదుల నిర్వహణ పనులు చేపట్టామని.. పాడైన, శిథిలమైన లైమ్ పాస్టర్‌ను తొలగించి, మరమ్మతులు చేపట్టామని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. తాజ్ మహల్ చుట్టూ ఉన్న గేట్‌వేలకు సైతం మరమ్మతులు చేపట్టారు.