Thu Nov 14 2024 16:22:14 GMT+0000 (Coordinated Universal Time)
World Bank : కమ్యునిస్టులు కూడా కామ్ అయిపోయారుగా.. ప్రపంచ బ్యాంకు రెండు తెలుగు రాష్ట్రాలనూ?
ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ఎంత డేంజరో ఆర్థిక నిపుణులను ఎవరిని అడిగినా చెబుతారు
ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ఎంత డేంజరో ఆర్థిక నిపుణులను ఎవరిని అడిగినా చెబుతారు. తాము ఇచ్చిన నిధులకు లెక్కా పత్రాలతో చెప్పడమే కాకుండా సంక్షేమ పథకాలకు కూడా కోత పెడుతుంది. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకుంటే ఒక రకంగా మన పిలక వారి చేతుల్లో ఉన్నట్లేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు రెండు తెలుగడు రాష్ట్రాలు ప్రపంచబ్యాంకు విషకౌగిలిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో చర్చించారు. అంటే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులిస్తే ఇక వారి పెత్తనమే కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి...
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొద్ది రోజుల క్రితం ఆయన జరిపిన అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో చర్చలు జరిపారు. వివిధ ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి నిధుల కోసం చర్చలు జరిపారు. ప్రజారోగ్య రంగానికి, హైదరాబాద్ 4.0, మూసీ ప్రక్షాళన, స్కిల్ యూనివర్సిటీ వంటి వారికి నిధులు ఇవ్వాలని కోరారు. నిధులు ఇచ్చేందుక ప్రపంచ బ్యాంకు ఎలాంటి అభ్యంతరాలుండవు. వడ్డీతో సహా నిధులను ముక్కుపిండి వసూలు చేస్తుంది. పైగా తాము చెప్పిన రంగాలకే నిధులను కేటాయించాలంటూ షరతులను విధించడంలో ప్రపంచ బ్యాంకు ఎప్పుడూ వెనకాడదు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తెచ్చుకున్నారు. అనేక సంస్కరణలను చేపట్టేందుకు వీటిని తీసుకున్నట్లు చెప్పారు. కానీ తర్వాత చంద్రబాబు ప్రజలపై పన్నుల భారం మోపాల్సి వచ్చింది. విద్యుత్తు నుంచి అన్ని రకాల పెన్నులు పెంచిన చంద్రబాబు నాడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ముఖ్యంగా కమ్యునిస్టు పార్టీల ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందడానికి అస్సలు అంగీకరించవు. పెద్దయెత్తున ఉద్యమం చేసేవి. ప్రపంచ బ్యాంకును రాష్ట్రానికి తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కామ్రేడ్లు కన్నెర్ర చేశారు. ఫలితంగా చంద్రబాబు రెండు దఫాలు అధికారానికి దూరం అవ్వాల్సి వచ్చింది.
పెదవి విప్పరే...
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ, అనంతరం రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం కానీ ప్రపంచ బ్యాంకు నిధుల జోలికి వెళ్లలేదు. ఎఫ్ఆర్ఎంబీ నిబంధనల మేరకు దేశీయ రుణాలను మాత్రమే తీసుకునే వారు. దీంతో సంక్షేమ పథకాల్లో కోత ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు జపం చేయడాన్ని ఆర్థిక నిపుణులు తప్పుపడుతున్నారు. ఇక రెండు రాష్ట్రాల్లో కమ్యునిస్టులు కూడా వీటిపై పెదవి విప్పడం లేదు. తెలంగాణలో కమ్యునిస్టులు కాంగ్రెస్ తో జతకట్టగా, ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వాన్ని కామ్రేడ్లు ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారన్న
Next Story