సరిపెట్టేశారు ….!!
ఇండియా ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సమం అయ్యింది. తొలివన్డే లో విజయం ముంగిట బోర్లాపడిన భారత్ ఈసారి అదే పరిస్థితిని తెచ్చుకోలేదు. 299 పరుగుల విజయలక్ష్యాన్ని కోహ్లీ [more]
ఇండియా ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సమం అయ్యింది. తొలివన్డే లో విజయం ముంగిట బోర్లాపడిన భారత్ ఈసారి అదే పరిస్థితిని తెచ్చుకోలేదు. 299 పరుగుల విజయలక్ష్యాన్ని కోహ్లీ [more]
ఇండియా ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సమం అయ్యింది. తొలివన్డే లో విజయం ముంగిట బోర్లాపడిన భారత్ ఈసారి అదే పరిస్థితిని తెచ్చుకోలేదు. 299 పరుగుల విజయలక్ష్యాన్ని కోహ్లీ సేన ఇంకా ఆరువికెట్లు నాలుగు బంతులు ఉండగానే చేరుకొని మూడో వన్డే పై కన్నేసింది. అడిలైడ్ లో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ బాట్స్ మెన్ మార్ష్ 123 బంతుల్లో 131 పరుగులు చేసి ఆసీస్ భారీ స్కోర్ కి పునాది వేశాడు. అద్వితీయ శతకంతో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి 298 పరుగులు సాధించింది. టీం ఇండియా లో భువనేశ్వర్ కు నాలుగు వికెట్లు, షమీ మూడు వికెట్లు జడేజాకు ఒక వికెట్ దక్కాయి.
వ్యూహాత్మకంగా ఆడిన టీం ఇండియా …
భారీ స్కోర్ ఛేదనకు దిగిన టీం ఇండియా వ్యూహాత్మకంగా బ్యాటింగ్ చేసింది. రోహిత్, ధావన్ లు ధాటిగానే బ్యాటింగ్ చేశారు. తొలివికెట్ కి ధావన్ 32 పరుగులకు వెనుతిరిగాడు. రోహిత్ 43 పరుగులకు అవుట్ కాగా అంబటి రాయుడు 24 పరుగులకు పెవిలియన్ బాట పట్టారు. తొలివన్డేలో ఫెయిల్ అయిన కోహ్లీ చావో రేవో తేల్చాలిసిన మ్యాచ్ లో అద్భుత సెంచరీతో ఆదుకుని ధోనితో కలిసి 87 పరుగుల మేచ్ విన్నింగ్ భాగస్వామ్యం నమోదు చేశాడు. విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారీ షాట్ ఆడి అవుటయ్యాడు. అనంతరం దినేష్ కార్తీక్, ధోని జంట వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని అధిగమించింది. ధోని 55 పరుగులు దినేష్ కార్తిక్ 25 పరుగులతో మ్యాచ్ ను నాలుగు బంతులు ఉండగానే ముగించి మెల్ బోర్న్ లో సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్ కు టీం ఇండియా కు అర్హత తెచ్చిపెట్టారు.