అటల్ జీకి ప్రపంచనేతల నివాళి...
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతి భారతదేశంతో పాటు ప్రపంచానికి కూడా తీరని లోటని వివిధ దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు. వాజ్ పేయి మృతికి అమెరికా, జపాన్, రష్యా, బ్రిటన్, పాకిస్తాన్ దేశాలు సంతాపాన్ని ప్రకటించాయి. వాజ్ పేయి అనే పేరు భారతదేశ రాజకీయాల్లో ఒక అంతర్భాగమని, ప్రపంచం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని రష్మా పేర్కొంది. భారత్ - అమెరికా మధ్య సంబంధాలు మెరుగవడంలో వాజ్ పేయి కీలకపాత్ర పోషించారని అమెరికా గుర్తు చేసుకుంది. భారత్ - పాక్ మధ్య సత్సంబంధాల కోసం వాజ్ పేయి విశేష కృషి చేశారని, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పాక్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. భూటాన్ రాజు జిగ్మే వాంగ్చుక్ స్వయంగా ఢిల్లీ వచ్చి వాజ్ పేయికి నివాళులు అర్పించారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వారి ప్రతినిధులను అంత్యక్రియలకు పంపించాయి.