ఏటీఎం కార్డు పనిచేస్తుందా లేదా ...?
సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా చర్యలు చేపట్టింది. 2015 సెప్టెంబర్ 1 నుంచి మాగ్నటిక్ స్ట్రిప్ వుండే కార్డు ల జారీని బ్యాంక్ లు నిలిపివేశాయి. కాగ్నటిక్ స్ట్రిప్ కార్డు ల జారీ మొదలైంది. అయితే అంతకుముందు జారీ చేసిన కొట్లాది కార్డు లు క్రమంగా మారుస్తూ వచ్చాయి బ్యాంక్ లు. చిప్ తో వుండే కార్డు లనే ఉపయోగించేలా కొత్త కార్డు లు జారీ చేస్తూ వచ్చాయి.
రద్దుకానున్న పాత కార్డులు ...
ఇప్పుడు గతంలో 2015 సెప్టెంబర్ 1 కు ముందు జారీ చేసిన కార్డు లు ఈనెలాఖరుతో రద్దు కానున్నాయి. ఫిబ్రవరి 1 న ఈ కార్డు లు ఏటీఎం లో పెడితే పనిచేయవు. కార్డు మీద సెల్ ఫోన్ చిప్ లా వుండే కార్డు లు వున్నవారికి మాత్రం కార్డు లు యధావిధిగా పనిచేస్తాయి. పాత కార్డు లు వున్నవారు తమ తమ బ్యాంక్ లకు వెళ్ళి కార్డు లు పొందవచ్చు. దీనికి బ్యాంక్ లు ఎలాంటి చార్జీలు విధించవు. సో ఏటీఎం కార్డు లు వినియోగించే వారు ముందే మీ కార్డు పనికొచ్చేదా పనికి రానిదా చెక్ చేసుకుని పనిచేయది కానీ అయితే మార్చుకోండి.