Sun Dec 22 2024 17:19:25 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సచివాలయ నిర్మాణానికి తొలగిన అడ్డంకి
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బైసన్ పోలో గ్రౌండ్ లో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగింది. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయ నిర్మాణానికి హైకోర్టు [more]
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బైసన్ పోలో గ్రౌండ్ లో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగింది. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయ నిర్మాణానికి హైకోర్టు [more]
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బైసన్ పోలో గ్రౌండ్ లో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగింది. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయం నిర్మించవద్దని దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం.. ఈ గ్రౌండ్ లో సచివాలయ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ గ్రౌండ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తే ఇక నూతన సచివాలయ నిర్మించుకునే అవకాశం ఉంది.
Next Story