Mon Dec 23 2024 15:37:44 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. బాలాపూర్ లడ్డూకు ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. 24,60 లక్షల ధర పలికింది.
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. బాలాపూర్ లడ్డూకు ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. 24,60 లక్షల ధర పలికింది. లక్షా 116 రూపాయలతో వేలం ప్రారంభమయింది. ఈ వేలంలో ఆరుగురు పాల్గొన్నారు. ఈ లడ్డూను వంగేటి లక్ష్మారెడ్డి ఈసారి దక్కించుకున్నారు. పది నిమిషాలు మాత్రమే కొనసాగిన ఈ వేలంపాటలో లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు.
గత ఏడాది 18.90 లక్షల వేలం...
గత ఏడాది 18.90 లక్షల వేలం పలికింది. బాలాపూర్ లడ్డూ కోసం అనేక మంది పోటీ పడుతుంటారు. స్థానికులయితే ఐదు వేలు వేలంపాటకు డిపాజిట్ చెల్లించాలి. స్థానికేతరులయితే గత ఏడాది పలికిన ధరను డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లడ్డూను దక్కించుకుంటే ఆరోగ్యఅశ్వైర్యాలు సమకూరుతాయని భావిస్తారు. గత 28 ఏళ్లుగా బాలాపూర్ లడ్డూను వేలం వేస్తూ వస్తున్నారు. గత ఏడాది కంటే అత్యధికంగా ఈసారి లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.
Next Story