కేసీఆర్ ది లాటరీ... చంద్రబాబు ది హిస్టరీ
దేశంలోనే అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్డుకు రూపకల్పన చేసిన చంద్రబాబును ఔటర్ చేయాలనుకుంటే ఔట్ ఆండ్ ఔట్ జోకర్స్ అయిపోతారని టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ యాసలో కేసీఆర్ కుటుంబంపై సినిమా డైలాగులతో విరుచుకపడ్డారు. ఆయన ప్రసంగంలోని డైలాగులు ఆయన మాటల్లోనే...
- చంద్రబాబు మీద లొల్లి చేస్తున్నారే.. కుళ్లు సెటైర్లు వేస్తున్నారు.
- చంద్రబాబు పేరును మూసిపెట్టుడంటే ధూనియా మీద మూకుడు వేపుడే.
- అమెరికా నుంచి పోరీలను తీసుకువచ్చి చింపినం.. పీకినం అని పులి వేశాలు వేస్తున్నారు.
- చంద్రబాబు జ్ఞపకాలను తుడిచేయాలంటే హైటెక్ సిటీని మూసేయాలి. అంత దమ్ముందా ?
- ఫ్లైఓవర్లు, శంషాబాద్ ఎయిర్ పోర్టును మూసేయాలి బిడ్డా... మూసి చూడుర్రి ఓపారి.
- చింపితే చిరిగిపోయేది కాదు చంద్రబాబు చరిత్ర.
- ఎవరికో పుట్టిన బిడ్డలకు తండ్రులమని చెప్పుకుని కొందరు బతుకుతున్నారు.
- జనం కళ్లల్లో కొలువుదీరిన బాహుబలి మన చంద్రబాబు.
- కేసీఆర్ ది లాటరీ చంద్రబాబు నాయుడిది హిస్టరి.
- ముస్లింలకు రిజర్వేషన్లని కేసీఆర్ బట్టేబాజ్ కబుర్లు చెప్పిండు.
- ఆంధ్రాకు కూడా వస్తామని బెదిరిస్తున్నాడు... రా... చూద్దాం..! రేపు ఓట్లతో ఇక్కడే జనం తరుముతే ఎక్కడికి వెళ్లి దాక్కోవాలో వాళ్లకు తెలియదు.
- మోదీని ఏమన్నానో తెలుసు కదా... నేనూ హైదరాబాద్ లోనే పెరిగిన.. నేను మోదీని మాట్లాడితే హిందీ రాని వాళ్లకు, వచ్చిన వాళ్లకు కూడా అర్థం కాలేదంట. నేను ఏం మాట్లాడిననో అందరికీ తెలుసు.
- ఆంధ్రప్రజల జోలికి వస్తే తెలంగాణ వాళ్లు ఊరుకోరు. తెలంగాణ జోలికి వస్తే ఆంధ్రా వారు ఊరుకోరు.