Thu Dec 26 2024 00:57:59 GMT+0000 (Coordinated Universal Time)
కాన్ఫిడెన్స్ ఇద్దామనుకున్నా... ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ గెలవకపోతే గొంతు కోసుకుంటా అన్ని వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ...‘కోపంలో చాలా అంటాం. అవన్నీ అవుతాయా..? మా పార్టీ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ నింపడానికి అలా అన్నాను... కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారింది. నేనేమీ అజ్ఞాతంలో లేను.. ఊహించని విధంగా పార్టీ ఓడిపోయినందున మానసికంగా బాధలో ఉన్నాను.’’ అని పేర్కొన్నారు.
Next Story