'భయమేస్తోంది..' బంగ్లాదేశ్ హెడ్ కోచ్
ప్రత్యర్థులు మనల్ని చూసి భయపెడితే ఆ వచ్చే కిక్కే వేరు. అప్పుడప్పుడూ ఆశ్చర్యపోయే విజయాలు నమోదు చేసే బంగ్లాదేశ్ ప్లేయర్లు మన క్రికెట్ టీమ్ ఆట తీరు చూసి భయపడుతున్నారు. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్‌కోచ్ చంద్రికా హతురుసింగా స్వయంగా చెప్పారు. ‘వాళ్ల దగ్గర మంచి బౌలర్లు ఉన్నారు. బుమ్రా అత్యుత్తమంగా ఆడుతున్నాడు. అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నారు. ఇక బ్యాటర్లు నిప్పులు కురిపిస్తున్నారు. ఎలాంటి భయమూ లేకుండా ఆడుతున్న భారత్ జట్టుని చూస్తే మాకు భయమేస్తోంది అని చంద్రికా ఎలాంటి శషభిషలు లేకుండా చెప్పాడు. ఇండియన్ ప్లేయర్లు క్రికెట్‌ని బాగా ఆస్వాదిస్తున్నారని ఆయన వెల్లడిరచాడు.

టీమ్ ఇండియా మాత్రం బంగ్లాదేశ్‌ని తక్కువగా అంచనా వేయడం లేదు. ఈ మధ్యే నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికాకు షాక్ తగిలిన తర్వాత పెద్ద టీమ్‌లన్నీ వళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతున్నాయి. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ భారత్‌తో మెరుగైన క్రికెట్టే అడుతోంది. 2022 డిసెంబర్ నుంచి రెండు టీమ్‌ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగగా, ఆ టీమ్ మూడిరటిలో గెలుపొందింది. ఈ మధ్యే జరిగిన ఆసియా కప్‌లో కూడా బంగ్లా చేతిలో భారత్ పరాభవం ఎదుర్కొంది.
కానీ మొత్తమ్మీద బంగ్లాదేశ్‌పై భారత్ అత్యుత్తమ ప్రదర్శనే కనబరిచింది. అన్ని ఫార్మాట్లలోనూ కలిపి రెండు దేశాలూ 66 సార్లు తలపడగా టీమ్ ఇండియా 54 సార్లు గెలిస్తే, బంగ్లాదేశ్ తొమ్మిది సార్లు నెగ్గింది. మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. యాభై ఓవర్ల క్రికెట్లో 31 సార్లు భారత్ గెలిచింది, తొమ్మిదిసార్లు బంగ్లాను విజయం వరించింది. ఇక భారత్ ధాటికి బంగ్లాదేశ్ తోక ముడుస్తుందో, లేదా ఇండియాకు షాక్ ఇస్తుందో తేలాలంటే.. సాయంత్య్రం వరకూ వెయిట్ చేయాలి.