Sat Nov 23 2024 02:08:19 GMT+0000 (Coordinated Universal Time)
మే నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే.. ఒకసారి చూసుకోండి
రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు సహా 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. మే 2023లో బ్యాంక్ సెలవులు..
2023 మే నెలలో బ్యాంక్ హాలిడేస్ గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ఆదేశాలను జారీ చేసింది. శని, ఆదివారాలతో సహా పండుగలు, ఇతర సందర్భాల కారణంగా మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. మే 2023లో పేర్కొన్న రోజుల్లో అన్ని వాణిజ్య, పబ్లిక్ బ్యాంకులు మూసివేయనున్నారు. రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు సహా 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. మే 2023లో బ్యాంక్ సెలవులు రాష్ట్రం, ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని సెలవులు జాతీయ ప్రభుత్వ సెలవులు, మరికొన్ని మునిసిపల్ సెలవులుగా గుర్తించారు. సెలవు దినాల్లో, బ్యాంకులు మూతపడినప్పుడు మొబైల్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. డబ్బును బదిలీ చేయడానికి UPIని కూడా ఉపయోగించవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలను ఉపయోగించవచ్చు.
మే 1న మహారాష్ట్ర డే/ మేడే కారణంగా బ్యాంకులకు సెలవు.
మే 5న బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, రాయ్పూర్, రాంచీ, సిమ్లా , శ్రీనగర్లో బ్యాంకులకు సెలవులు.
మే 7న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.
మే 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్కతాలో బ్యాంకులకు సెలవు.
మే 13న రెండో శనివారం దేశవ్యాప్తంగా సెలవు.
మే 14న ఆదివారం బ్యాంకులకు సెలవు రోజు.
మే 16న సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా ఆ రాష్టంలో బ్యాంకుల మూత.
మే 21న ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు
మే 22న మహారాణా ప్రతాప్ జయంతి నేపథ్యంలో సిమ్లాలో బ్యాంకులకు సెలవు
మే 24న కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా త్రిపురలో సెలవు.
మే 27న నాల్గవ శనివారం సెలవు.
మే 28న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
Next Story