Mon Dec 23 2024 15:05:05 GMT+0000 (Coordinated Universal Time)
మద్యం ప్రియులకు షాక్.. చేదెక్కనున్న బీర్ల ధరలు
బీర్ తయారీకి బార్లీ, మాల్ట్ అనేవి ముడి పదార్థాలు. బార్లీని అధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా రెండవ స్థానంలో ఉంది. ఇక ఉక్రెయిన్..
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ప్రభావం భారత్ పై పడుతుందని నిపుణులు మొదట్నుంచి చెప్తూనే ఉన్నారు. అయితే.. ముందుగా ఆ ప్రభావం బీర్లపై పడింది. ఇది బీరు ప్రియులకు నిజంగా చేదువార్తే. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఇక్కడ బీర్ల ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి. అక్కడ యుద్ధం జరిగితే.. ఇక్కడ బీర్ల ధరలు పెరగడం ఏంటి ? అనుకుంటున్నారా. పూర్తిగా చదవండి.
Also Read : భారత్ లో భారీగా పెరిగే ధరలు ఇవే
బీర్ తయారీకి బార్లీ, మాల్ట్ అనేవి ముడి పదార్థాలు. బార్లీని అధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా రెండవ స్థానంలో ఉంది. ఇక ఉక్రెయిన్ మాల్ట్ ఉత్పత్తిలో ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. ఇప్పుడీ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధానికి ఇప్పుడప్పుడే ముగింపు లేకుండా.. మరికొంతకాలం ఇలాగే సాగితే.. బార్లీకి కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. రష్యా నుంచి బార్లీ ఎగుమతులు ఆగిపోతే.. దాని ప్రభావంతో ఇక్కడ బీర్ల ధరలు పెరగవచ్చు.
మనదేశంలోనూ బార్లీ పండుతోంది. చాలా వరకు బ్రూవరీ కంపెనీలు దేశీయ బార్లీతోనే బీర్లను తయారు చేస్తున్నాయి. కానీ.. అంతర్జాతీయ మార్కెట్లో బార్లీ ధరలు అమాంతం పెరిగిపోతే, దేశీ మార్కెట్లో తక్కువకు ఎవరు విక్రయిస్తారు? క్రమంగా దేశీ ధరలు కూడా పెరిగిపోతాయి. దాంతో బీర్ల తయారీ కంపెనీలకు తయారీ వ్యయాలు అధికమవుతాయి. ఫలితంగా ఈ భారాన్నంతా బీరును లొట్టలేసుకుంటూ తాగే వారే భరించాల్సి ఉంటుందన్నమాట.
Next Story