Fri Dec 20 2024 08:42:06 GMT+0000 (Coordinated Universal Time)
BJP : 35 మందితో మూడో జాబితా
భారతీయ జనతా పార్టీ మూడో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది
భారతీయ జనతా పార్టీ మూడో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మూడో విడత జాబితాలో మొత్తం 35 మంది అభ్యర్థులను పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ఇప్పటి వరకూ తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మూడు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తొలి విడతలో యాభై రెండు మంది పేర్లను విడుదల చేసింది. రెండో విడత జాబితాలో ఒకే ఒక్క పేరును ప్రకటించింది. మూడో విడత జాబితాలో 35 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో మొత్తం 88 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించినట్లయింది.
ఇంకా మిగిలిన...
మూడో విడత జాబితాలో అంబర్ పేట నుంచి కృష్ణ యాదవ్ పేరును ఖరారు చేసింది. ఉప్పల్ నుంచి ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభకార్ పేరుతో పాటు మరికొందరి పేర్లను ఖరారు చేసింది. ఇంకా జనసేన పొత్తు ఖరారు కావాల్సి ఉంది. జనసేనకు ఎన్ని స్థానాలు ఇవ్వాల్సింది తేల్చిన తర్వాత మిగిలిన జాబితా ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేనకు తొమ్మిది నుంచి పది స్థానాలు ఇచ్చే అవకాశముందని తెలిసింది. మిగిలిన అభ్యర్థుల జాబితాను కూడా త్వరలో ప్రకటించే అవకాశముంది.
Next Story