Tue Dec 24 2024 00:30:41 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హైకోర్టులో ప్రభాస్ కు ఊరట
రాయదుర్గంలోని తన గెస్ట్ హౌజ్ ను ప్రభుత్వం సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ స్థలంపై యధాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాయదుర్గంలోని ప్రభాస్ ఇంటిని నాలుగు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ రెండు వేల గజాల స్థలాన్ని ప్రభాస్ ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసారు. అయితే, ఇది ప్రభుత్వ భూమి అంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దింతో అధికారులు ఈ స్థలాన్ని సీజ్ చేసి నోటీసులు అంటించారు. దీనిని సవాలు చేస్తూ హైకోర్టులో హీరో ప్రభాస్ పిటీషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.
Next Story