టీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనుందా..?
‘సారు.. కారు.. పదహారు’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ఇచ్చారు. 16 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటామని [more]
‘సారు.. కారు.. పదహారు’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ఇచ్చారు. 16 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటామని [more]
‘సారు.. కారు.. పదహారు’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ఇచ్చారు. 16 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటామని అనుకున్న ఆ పార్టీ కేవలం 9 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అనూహ్యంగా పుంజుకొని నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నిజామాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 46 వేల ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కరీంనగర్ లో వినోద్ కుమార్ పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 73 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అదిలాబాద్ లో 55 వేల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు ఉన్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 35 వేల లీడ్ లో ఉన్నారు.
మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం…
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. మూడు స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. నల్గొండలో టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 16 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. భువనగిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 4 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 8 వేల ట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మల్కాజ్ గిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మధ్య ఆధిక్యత మారుతోంది. ఇక్కడ ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది.