కష్టాల్లో బిగ్ బాస్
బిగ్ బాస్ షో వ్యవహారం కాస్తా కోర్టుకెక్కింది.. బిగ్ బాస్ షోలో మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, దీనిపైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ [more]
బిగ్ బాస్ షో వ్యవహారం కాస్తా కోర్టుకెక్కింది.. బిగ్ బాస్ షోలో మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, దీనిపైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ [more]
బిగ్ బాస్ షో వ్యవహారం కాస్తా కోర్టుకెక్కింది.. బిగ్ బాస్ షోలో మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, దీనిపైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అంతేకాకుండా రాత్రి 11 గంటల తర్వాత షో టెలికాస్ట్ చేసే విధంగా టీవీ ఛానల్ కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు బిగ్ బాస్ నిర్వాహకులు పై ఉన్న కేసులకు సంబంధించి వ్యవహారం కూడా కోర్టుకెక్కింది.
కోర్టును ఆశ్రయించిన….
తమపై పోలీసులు పెట్టిన కేసులను కొట్టివేయాలని అంటూ బిగ్ బాస్ షో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పాటుగా ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులు దాఖలు చేశారు ..ఈ రెండు పిటిషన్ల పైన హైకోర్టు నేడు విచారణ జరిపే అవకాశం ఉంది ..మరోవైపు కేతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ఇద్దరు బాధితులు నేడు హైకోర్టును ఆశ్రయించే బోతున్నారు. బిగ్ బాస్ షో కంటెస్టెంట్ లకు సంబంధించి జాబితా ఇప్పటికే బయటకు వచ్చింది.. బిగ్ బాస్ షో నిర్వాహకులపై ఇప్పటికే రెండు కేసులు నమోదు అయ్యాయి ..ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ కొనసాగుతోంది ..నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి పిలిచి విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.