Mon Dec 23 2024 20:14:57 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 5 సీజన్ విజేత సన్నీ
బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా ముగిసింది. విజేతగా సన్నీ నిలిచారు
బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా ముగిసింది. విజేతగా సన్నీ నిలిచారు. రన్నరప్ గా షణ్మఖ్ జస్వంత్ ఉన్నారు. తొలుత సిరి ఎలిమేనేట్ అయింది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటి రష్మిక మందన్నా హౌస్ లోకి వచ్చి ఎలిమినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. తొలిసారి సిరి, తర్వాత మానస్, ఆ తర్వాత శ్రీరామచంద్ర ఎలిమినేట్ అయ్యారు. విన్నర్ గా సన్నీ, రన్నర్ అప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు.
నాలుగున్నర గంటల మారథాన్ షో....
గ్రాండ్ ఫినాలేకు రాజమౌళి, ఆలియా భట్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, వెబ్ సిరీస్ లో నటిస్తున్న జగపతి బాబు, పుష్ప టీం నుంచి దర్శకుడు సుకుమార్, రష్మిక మందన్నా, దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. బిగ్ బాస్ విన్నర్ కు యాభై లక్షల ప్రైజ్ మనీతో పాటు ఇరవై ఐదు లక్షల విలువైన స్థలం లభిస్తుంది. రన్నర్ అప్ గా నిలిచిన వారికి ఇరవై ఐదు లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఉత్సాహ భరితంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగింది.
Next Story