బిర్యానీ లేట్ అయ్యిందని ...!!
ఈమధ్య ప్రజల్లో అసహనం బాగా పెరిగిపోతుంది. అందులోను మందు కొట్టి ఉంటే కోపం తారాస్థాయికి చేరుతుంది. క్షణాల్లో అన్ని ముందుకు తెచ్చే సాంకేతిక యుగంలో అరక్షణం ఆలస్యాన్ని ఎవరు సహించలేకపోతున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్లు, బార్లు ఒక్కోసారి కస్టమర్ల ఆగ్రహానికి యుద్ధ క్షేత్రాలు అయిపోతున్నాయి. తాజాగా యుపిలో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఖాకీని చితకొట్టిన బిజెపి నేత ...
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ రెస్టారెంట్ కి ఒక సప్పల్ సింగ్ పవర్ అనే పోలీస్ తన గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాడు. వారిద్దరూ ఫుల్ గా మందుకొట్టి భోజనానికి ఆకలిమీద రావడంతో ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ ఆలస్యంగా రావడంతో ఉగ్రులయ్యారు. ముఖ్యంగా పక్కన తన బాయ్ ఫ్రెండ్ పోలీస్ కావడంతో ఖాకీ గర్ల్ ఫ్రెండ్ శివంగి అవతారం ఎత్తింది. రెస్టారెంట్లో వున్న కప్పులు ప్లేట్ లు నేలకేసి కొట్టేసింది. ఈ హంగామా చూసి అక్కడికి వచ్చిన రెస్టారెంట్ అధినేత స్థానిక కార్పొరేటర్ మునీష్ కుమార్ ముందు సముదాయించాలని ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మందు కొట్టిన వారిద్దరూ చెలరేగడంతో చిర్రెత్తికొచ్చి సదరు పోలీసును కుక్కను కొట్టినట్లు కొట్టాడు. ప్రస్తుతం కేసు స్థానిక పోలీస్ స్టేషన్ కి చేరినా దేశమంతా ఈ వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేసేస్తోంది