కమలం.. కళ కళ..!
ఈ రోజు వెలువడుతున్న నాలుగు రాష్ట్రాల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో కమలం పార్టీ దుమ్ము రేపుతోంది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలలో భాజపా భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉండగా... తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సెమీ ఫైనల్స్లో భాజపా హవా

రాజస్థాన్లో భాజపా విజయాన్ని ఎగ్జిట్ పోల్స్ ఊహించినా, మధ్యప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని అంతా భావించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, మధ్యలో భాజపా అధికారాన్ని హస్తం నుంచి లాక్కోవడంతో... మధ్య ప్రదేశ్లో జనం భాజపాకు ఓట్లేయరని కాంగ్రెస్ శ్రేణులు ఊహించాయి. అనూహ్యంగా మధ్యప్రదేశ్లో భాజపా... భారీ ఆధిక్యంతో అధికారంలోకి వస్తోంది. రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య నిరంతరం రాజుకుంటున్న వివాదాలు ఆ పార్టీపై ప్రజల్లో విముఖతకు కారణమయ్యాయి. ఇది భాజపాకు వరమైంది. మోదీ ప్రచారం కూడా కమలానికి కలిసొచ్చింది.
ఇక చత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా భాజపా విజయానికి కారణమవుతోంది. ఈ ఫలితాలు వచ్చే సారి కేంద్రంలో అధికారం అందుకోవాలనుకుంటున్న కాంగ్రెస్, ఇండియా అలయన్స్ ఆశలపై నీళ్లు కుమ్మరిస్తున్నాయి.