Thu Dec 26 2024 00:57:19 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ‘రాఫేల్’ లొల్లి..!
రాఫేల్ డీల్ పై కాంగ్రెస్ అసత్య ఆరోపణలకు పాల్పడిందని ఆరోపిస్తూ రాష్ట్ర బీజేపీ నాయకులు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. మంగళవారం బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, రాజాసింగ్, రాంచంద్రరావు, శ్రీధర్ రెడ్డి తదితరులు పెద్దఎత్తున కార్యకర్తలతో కలిసి గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు చేయడం మానుకొని క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పూర్తి అవినీతి, కుంభకోణాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
Next Story