చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..?
డేటా చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఐటీ గ్రిడ్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు [more]
డేటా చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఐటీ గ్రిడ్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు [more]
డేటా చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఐటీ గ్రిడ్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీని తానే కనిపెట్టానని పగల్బాలు పలికే చంద్రబాబు మాటల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో లోకేష్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాదని, ప్రజల భవిష్యత్తు, విశ్వసనీయతకు సంబంధించిన వ్యవహారమన్నారు. ఎన్నికల సంఘం ఈ విషయంలో కలగజేసుకోవాలని కోరారు.