Mon Dec 23 2024 12:51:38 GMT+0000 (Coordinated Universal Time)
నితిన్ కాదట.. నిఖిల్ అట
జేపీ నడ్డా కలవాలనుకుంది నితిన్ ను కాదట. కార్తికేయ 2 హీరో నిఖిల్ ని కలవాలని జేపీ నడ్డా భావించారంటున్నారు.
తెలంగాణ బీజేపీ నేతలు పొరపాటు పడ్డారా? సినిమా హీరోల విషయంలో తడబడ్డారా? అంటే బీజేపీలో ఇదే ప్రచారం జరుగుతుంది. నిఖిల్ కి బదులు నితిన్ ను ఆహ్వానించారన్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బీజేపీలో ఈ అంశం పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఆ కార్కక్రమం ముగియకుండానే వరంగల్ నుంచి నేరుగా బయలు దేరి హైదరాబాద్ నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు.
హిట్ కావడంతో....
ఆయన నితిన్ ను కలుస్తారని ముందుగానే వార్తలు వచ్చాయి. ఆ ప్రకారమే సినీ హీరో నితిన్ జేపీ నడ్డాను కలిశారు. కాసేపు ముచ్చటించి వెళ్లిపోయారు. నితిన్ తాను పార్టీ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ జేపీ నడ్డా కలవాలనుకుంది నితిన్ ను కాదట. కార్తికేయ 2 హీరో నిఖిల్ ని అట. కార్తికేయ 2 సినిమా బాలివుడ్ లోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆయనను కలవాలని జేపీ నడ్డా భావించారంటున్నారు. ఆయన పొరపాటున బీజేపీ నేతలకు నిఖిల్ కు బదులు నితిన్ పిలవాలని అనడంతోనే ఈ తప్పిదం జరిగిందంటున్నారు.
పేరులో కన్ఫ్యూజన్....
అయితే పేరులో కన్ఫ్యూజన్ అయిన బీజేపీ నేతలు నిఖిల్ ను బదులు నితిన్ ను పిలిచారంటున్నారు. తెలంగాణలో హీరో నిఖిల్ ఫేమస్ కావడంతో ఆయననే కలవాలనుకుంటున్నారని భావించి బీజేపీ నేతలు పిలిచారట. కానీ వాస్తవానికి జేపీ నడ్డా కలవాలనుకున్నది మరో హీరో నిఖిల్ ని అని అంటున్నారు. నిఖిల్ కు, నితిన్ కు తేడా తెలియని బీజేపీ నేతలు నితిన్ ను పిలిచారన్న టాక్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది.
Next Story