లక్ష్మణ్ నిరాహార దీక్ష ప్రారంభం
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు ఉదృతమవుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. [more]
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు ఉదృతమవుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. [more]
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు ఉదృతమవుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ నిర్భందం విధించి అరెస్టులు చేస్తుండటంతో ఆయన ప్రైవేటు వాహనంలో పార్టీ కార్యాలయానికి చేరుకొని దీక్షను ప్రారంభించారు. ఫలితాల్లో అవకతవకలపై సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.