Mon Dec 23 2024 05:56:38 GMT+0000 (Coordinated Universal Time)
యూపీలో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన బీజేపీ
ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి బీజేపీ అధికారం దిశగా పయనిస్తుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది
ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి బీజేపీ అధికారం దిశగా పయనిస్తుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ మొత్తం 221 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 202. ఇప్పటికే ఈ ఫిగర్ ను బీజేపీ దాటేసింది. 221 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉండటంతో ఇక్కడ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం దాదాపు ఖాయంగా కన్పిస్తుంది.
రెండోసారి అధికారం దిశగా....
సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆరు స్థానాల్లోనూ, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లోనూ ముందంజలో ఉంది. రెండోసారి ఉత్తర్ ప్రదేశ్ ను బీజేపీ కైవనం చేసుకోవడం ఖాయంగా కన్పిస్తుంది. సమాజ్ వాదీ పార్టీ మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అయ్యేటట్లు ఉంది.
Next Story