Sat Dec 21 2024 02:42:14 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ గాంధీ తో పాటు.. మాజీ సీఎం ను చంపేస్తాం..
రాహుల్ గాంధీతో పాటు మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కూడా లేపేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా.. ఇది ఆకతాయిల
భారత్ జోడో పాదయాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని చంపేస్తామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చేరుకుంది. జోడో యాత్ర జుని ప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉంది. రాహుల్ పై బాంబు దాడి చేస్తామంటూ జుని ప్రాంతంలోని ఓ స్వీట్ షాపు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు లేఖను వదిలి వెళ్లారు. ఇండోర్ కు రాహుల్ యాత్ర చేరుకోగానే నగరం బాంబుల దాడులతో దద్దరిల్లిపోతుందని ఆ లేఖలో హెచ్చరించారు.
రాహుల్ గాంధీతో పాటు మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కూడా లేపేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా.. ఇది ఆకతాయిల పని అయి ఉంటుందని అనుకున్నప్పటికీ.. పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆ లేఖను స్వీట్ షాపు వద్ద వదిలిన దుండగుడిని పట్టుకునేందుకు సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సేకరిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర సందర్భంగా సావర్కార్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో.. ఈ బెదిరింపులను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇది ఉగ్రవాదుల బెదిరింపా లేక ప్రత్యర్థుల పన్నాగమా తెలుసుకునే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story