Mon Dec 23 2024 17:45:35 GMT+0000 (Coordinated Universal Time)
మేయర్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు
టీడీపీలో వివాదంపై ఆ పార్టీ నేత బోండా ఉమ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో వర్గపోరు ఉండదు.. చంద్రబాబు వర్గం మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు. [more]
టీడీపీలో వివాదంపై ఆ పార్టీ నేత బోండా ఉమ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో వర్గపోరు ఉండదు.. చంద్రబాబు వర్గం మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు. [more]
టీడీపీలో వివాదంపై ఆ పార్టీ నేత బోండా ఉమ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో వర్గపోరు ఉండదు.. చంద్రబాబు వర్గం మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న వివాదాలు ఉన్నా.. వాటిని అధినేత పరిష్కరిస్తారని తెలిపారు. ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు ఆదేశాలను అందరూ గౌరవిస్తారని పేర్కొన్నారు. అనేక మంది పోటీ చేయాలని భావించడం సహజమన్నారు. అభ్యర్థుల ఎంపికలో వివాదం ఉంటే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మేయర్ అభ్యర్థి అనేది ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపారు. అధిష్టానం ఎవరి పేరును సూచిస్తే వారికే తమ సహకారం ఉంటుందని బోండా ఉమ ప్రకటించారు.
Next Story