Wed Jan 15 2025 06:36:04 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతలు వందల కోట్లు ఇలాగే సంపాదిస్తున్నారు
వైసీపీ పై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ద్వారా వందల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు [more]
వైసీపీ పై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ద్వారా వందల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు [more]
వైసీపీ పై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ద్వారా వందల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు కూడబెట్టుకుంటున్నారన్నారు. అక్రమంగా ఇసుకను తోడేస్తూ పర్యవారణానికి ముప్పు కల్పిస్తున్నారని బోండా ఉమ అన్నారు. చెవిటికల్లులో అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్న వారిపై కేసులు పెట్టకుండా వదిలేశారని బోండా ఉమ అన్నారు. వైసీపీ నేతలకు ఇసుక ఆదాయవనరుగా మారిందన్నారు. దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టును ఆశ్రయిస్తామని బోండా ఉమ తెలిపారు. అక్రమ మైనింగ్ కు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందన్నారు. రోజుకు ఇసుక ద్వారా వైసీపీ నేతలు మూడు వందల కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నారని బోండా ఉమ అన్నారు.
Next Story