ఉద్యోగులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
విధినిర్వహణలో ఉద్యోగులు మరణిస్తున్నా వారికి ప్రభుత్వం సాయం చేయకపోవడం పట్ల ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల కనీస అవసరాలను గుర్తించి [more]
విధినిర్వహణలో ఉద్యోగులు మరణిస్తున్నా వారికి ప్రభుత్వం సాయం చేయకపోవడం పట్ల ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల కనీస అవసరాలను గుర్తించి [more]
విధినిర్వహణలో ఉద్యోగులు మరణిస్తున్నా వారికి ప్రభుత్వం సాయం చేయకపోవడం పట్ల ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల కనీస అవసరాలను గుర్తించి ప్రభుత్వం స్పందించాలన్నారు. ఇప్పటికే సచివాలయంలో తొమ్మిది మంది ఉద్యోగులు కరోనా బారిన పడి మరణించారన్నారు. అనేక మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. వర్క్ ఫ్రం హోం అడిగినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఉద్యోగులు వైద్యానికి ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకూ చెల్లించలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన చెందారు. తమిళనాడు ప్రభుత్వం తరహాలో కరోనాతో మృతిచెందిన ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.