బ్రేకింగ్ : సుజనా గుట్టును బయటపెట్టిన బొత్స
రాజధాని అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సుజనాచౌదరి తనకు రాజధాని ప్రాంతంలో అంగుళం భూమి లేదని అన్నారని, సుజనా సోదరుడు [more]
రాజధాని అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సుజనాచౌదరి తనకు రాజధాని ప్రాంతంలో అంగుళం భూమి లేదని అన్నారని, సుజనా సోదరుడు [more]
రాజధాని అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సుజనాచౌదరి తనకు రాజధాని ప్రాంతంలో అంగుళం భూమి లేదని అన్నారని, సుజనా సోదరుడు కుమార్తె పేరు మీద 14 ఎకరాల భూమి ఉందని తెలిపారు. అలాగే సుజనా చౌదరికి చెందని ఒక కంపెనీకి రాజధానిలో 110 ఎకరాల భూమి ఉందన్నారు. పదే పదే చెప్పమని అంటూ అంత తొందరపడటమెందుకని ప్రశ్నించారు. తాను ఇప్పుడే సుజనాకు 124 ఎకరాలు ఉన్నట్లు చూపించానని తెలిపారు. ఎకరం లక్ష చొప్పున 500 ఎకరాలను తన బంధువులకు చంద్రబాబు కట్టబెట్టారని బొత్స ఆరోపించారు. దీనికి చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెబుతారని బొత్స నిలదీశారు. లోకేష్ బంధువు రామారావు పేరిట 500 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. రాజధాని ప్రాంతంతో పాటు అన్ని ప్రాంతాలు ప్రగతి సాధించాలన్నారు.