కూల్చడం ఖాయం
కరకట్ట మీద ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేయడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అక్రమ కట్టడంలో ఉండి చంద్రబాబు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారన్నారు. ఒక మాజీ [more]
కరకట్ట మీద ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేయడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అక్రమ కట్టడంలో ఉండి చంద్రబాబు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారన్నారు. ఒక మాజీ [more]
కరకట్ట మీద ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేయడం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అక్రమ కట్టడంలో ఉండి చంద్రబాబు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ పని చేయొచ్చా? అని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చంద్రబాబు నివాసం వరకూ వచ్చి ఎందుకు ఆగిపోయిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నివాసాన్ని కూల్చి వేయడం లేదని, మొన్న జారీ చేసిన నోటీసులు చివరివని ఆయన తెలిపారు. చంద్రబాబు ఇప్పటికైనా నివాసం ఖాళీ చేసి వెళ్లిపోవడం మంచిదన్నారు. కాగా నేడు సీఆర్డీఏ కరకట్ట మీద ఉన్న కొన్ని నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియను ప్రారంభించింది. పాతూరి గెస్ట్ హౌస్ ర్యాంప్ ను కూల్చి వేశారు. నిర్మాణాలు సక్రమమే అయితే కోర్టుకు వెళ్లవచ్చని బొత్స సత్యనాారాయణ సూచించారు.