రేపు పేర్లను బయటపెడతా
మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన అనయాయులకు భూములు కట్టబెట్టడానికి ప్రయత్నించారన్న తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. [more]
మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన అనయాయులకు భూములు కట్టబెట్టడానికి ప్రయత్నించారన్న తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. [more]
మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన అనయాయులకు భూములు కట్టబెట్టడానికి ప్రయత్నించారన్న తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. రేపు రాజధాని ప్రాంతంలో భూములున్న వారి పేర్లను బయటపెడతానని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధానికి అమరావతి ప్రాంతం అనువైనది కాదని నిపుణుల కమిటీ తేల్చి చెప్పిందన్నారు. చంద్రబాబు రాజధానిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీలను మాత్రమే నిర్మించారన్నారు. చంద్రబాబు తన వియ్యంకుడి కోసం సీఆర్డీఏ పరిధిని కూడా పెంచారన్నారు. ఆయనకు 498 ఎకరాలను లక్ష రూపాయల ధరకు రాజధాని ప్రాంతంలో భూములు కట్టబెట్టారని బొత్స సత్యనారాయణ తెలిపారు.అసైన్డ్ భూముల చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం అక్రమించిందన్నారు. రాజధాని ముసుగులో అసైన్డ్ భూములను కొనుగోలు చేశారన్నారు.