దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, చంద్రబాబు
అలాగే.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి.
నేడు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులందరికీ, దేశ ప్రజలకు తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేస్తాయని కేసీఆర్ తెలిపారు. ఒకవైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు పురోగమిస్తున్నా.. మరోవైపు విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో క్రీస్తు బోధనలు ఆచరణీయమైనవని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
అలాగే.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి కోసం పాటుపడటం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవమని ట్వీట్ చేశారు. క్రీస్తు రాజ్యంలో సేవ తప్ప దేనికీ చోటులేదన్నారు. క్రీస్తు జన్మదినం సర్వమానవాళికి పవిత్ర దినం. శాంతి శకానికి ఆరంభదినం. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.