Tue Jan 07 2025 21:56:00 GMT+0000 (Coordinated Universal Time)
ఓవర్ టు ఢిల్లీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. నిన్ననే కవిత ఢిల్లీ చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కవితతో పాటు మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్లు బయలుదేరి వచ్చారు. న్యాయనిపుణులతో సంప్రదించారు. ఉదయం కూడా న్యాయనిపుణులతో భేటీ అయిన అనంతరం కవిత ఈడీ విచారణకు హాజరు కావాలా? వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 16వ తేదీన కూడా కవిత ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు.
ముగ్గురిని కలిపి...
మరోవైపు ఈడీ కూడా సుప్రీంకోర్టులో కేవియట్ పిటీషన్ వేసింది. ఈ నేపథ్యంలో నేడు కల్వకుంట్ల కవిత విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈరోజుతో అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీ కూడా ముగియనుంది. మాగంటి శ్రీనివాసులు రెడ్డి కూడా ఈ నెల 18వ తేదీన హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత, అరుణ్ రామచంద్ర పిళ్లైలను కలసి ఈడీ విచారించే అవకాశముందని చెబుతున్నారు. ఈరోజు పిళ్లైను కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. మరికొంత కాలం కస్టడీకి అనుమతి కోరే ఛాన్స్ ఉంది.
Next Story