Mon Dec 23 2024 14:13:33 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ సీఎం యడియూరప్ప మనవరాలు అనుమానాస్పద మృతి
కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మనవరాలు సౌందర్య(30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది.
కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మనవరాలు సౌందర్య(30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది. బెంగళూరులోని ఆమె ఇంట్లో.. సౌందర్య విగతజీవిగా కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించడంతో.. పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. హై గ్రౌండ్స్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సౌందర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేగాని.. ఆమెది ఆత్మహత్యో కాదో చెప్పలేమంటున్నారు పోలీసులు.
Also Read : ఇండో - పాక్ సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
యడియూరప్ప పెద్ద కూతురు పద్మ కుమార్తె సౌందర్య. వృత్తిరీత్యా సౌందర్య వైద్యురాలు. 2018లో నీరజ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహమవ్వగా.. ఓ బిడ్డకూడా ఉన్నారు. వివాహం తర్వాత సౌందర్య భర్తతో కలిసి వసంత నగర్ లోని మౌంట్ కార్మెల్ కాలేజీ సమీపంలో ఉన్న ఓ అపార్టమెంట్ లో నివాసం ఉంటున్నారు. భర్త నీరజ్ కూడా వైద్యుడే. శుక్రవారం ఉదయం 8 గంటలకే అతను ఇంటినుంచి బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పనిమనిషి వచ్చి.. తలుపు తట్టగా ఎంతకూ తెరవకపోయే సరికి.. ఆమె నీరజ్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే నీరజ్ ఇంటికి వచ్చి చూడగా.. సౌందర్య చనిపోయి ఉంది. పోలీసులకు సమాచారమివ్వగా వారు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు.
News Summary - BS Yediyurappa's Granddaughter Soundarya Allegedly Dies by Suicide, CM Bommai Rushes to Hospital
Next Story