Mon Dec 23 2024 19:14:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: టీడీపీపై ఎంపీ బుట్టా అసంతృప్తి
తెలుగుదేశం పార్టీపై ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుక అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు పార్లమెంటు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున గెలిచిన ఆమె తర్వాత పార్టీ ఫిరాయించి [more]
తెలుగుదేశం పార్టీపై ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుక అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు పార్లమెంటు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున గెలిచిన ఆమె తర్వాత పార్టీ ఫిరాయించి [more]
తెలుగుదేశం పార్టీపై ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుక అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు పార్లమెంటు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున గెలిచిన ఆమె తర్వాత పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె మళ్లీ కర్నూలు పార్లమెంటు నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలని భావించారు. ఈ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే, కాంగ్రెస్ నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేరికతో ఆయనకు ఈ టిక్కెట్ ను ఖాయం చేశారు చంద్రబాబు. దీంతో బుట్టా రేణుక అసంతృప్తిగా ఉన్నారు. ఇవాళ కోడుమూరులో జరిగిన చంద్రబాబు సభకు కూడా ఆమె హాజరుకాలేదు. ఆమె టీడీపీని వీడుతారని ప్రచారం జరుగుతుంది.
Next Story