By elections : పోటెత్తిన ఓటర్లు.. భారీ పోలింగ్ దిశగా…?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదవుతుంది. ఉదయం 11 గంటల సమాయానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో 33 [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదవుతుంది. ఉదయం 11 గంటల సమాయానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో 33 [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదవుతుంది. ఉదయం 11 గంటల సమాయానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో 33 శాతం పోలింగ్ నమోదయింది. అలాగే బద్వేలు నియోజకవర్గంలో 21 శాతం పోలింగ్ నమోదయింది. ఓటర్లు అనేక పోలింగ్ కేంద్రాలో బారులు తీరి కనిపిస్తున్నారు. ఎన్నడూ లేనిది బద్వేలులోనూ ఓటర్లు క్యూ కట్టారు.
ఇక్కడ 90.. అక్కడ 70 శాతం….
పోలింగ్ కు రాత్రి 7 గంటల వరకూ సమయం ఉండటంతో హుజూరాబాద్ లో 90 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయి. అలాగే బద్వేలు నియోజకవర్గంలోనూ 70 శాతం పోలింగ్ జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నిక కావడంతో అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించాయి.