ఆర్టీసీలో మొదలైన ముసలం
ఆర్టీసీ కార్మికుల్లో ముసలం మొదలైంది. గురువారం సీఎం కేసీఆర్ వ్యాఖ్యల తరువాత కార్మికులు ఆలోచనలో పడ్డారు. 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మెట్టుదిగడం లేదు. గురువారం [more]
ఆర్టీసీ కార్మికుల్లో ముసలం మొదలైంది. గురువారం సీఎం కేసీఆర్ వ్యాఖ్యల తరువాత కార్మికులు ఆలోచనలో పడ్డారు. 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మెట్టుదిగడం లేదు. గురువారం [more]
ఆర్టీసీ కార్మికుల్లో ముసలం మొదలైంది. గురువారం సీఎం కేసీఆర్ వ్యాఖ్యల తరువాత కార్మికులు ఆలోచనలో పడ్డారు. 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మెట్టుదిగడం లేదు. గురువారం సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను బట్టిచూస్తే ఇక కార్మికులకు కష్టాలేననే చర్చ జరుగుతోంది. కార్మికులు మంచివారేనని, యూనియన్ నాయకులే తప్పుదోవపట్టిస్తున్నారని సీఎం ఘాటుగా చెప్పారు. దీంతో ఇప్పుడు కార్మికులు అసలు ఏం జరుగుతుందీ అని ఆలోచిస్తున్నారు. ఇక ఓ డ్రైవర్ కూకట్ పల్లి పోలీసులకు జేఏసీ కన్వీనర్ అశ్వద్థామరెడ్డిపై ఫిర్యాదు చేశారు. కార్మికులను అశ్వద్థామరెడ్డి తప్పు దోవ పట్టిస్తున్నారంటూ రాజు అనే డ్రైవర్ పోలీసులను ఆశ్రయించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యకు కూడా అశ్వథ్థామరెడ్డి కారణమని రాజు తన ఫిర్యాదులో పేర్కొనడం విశేషం.