ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు నమోదు
ఆంధ్రజ్యోతి యాజమాని వేమూరి రాధాకృష్ణపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన వాయిస్ ను డబ్బింగ్ చేసి ఏబీఎన్ ఛానల్ లో తప్పుడు [more]
ఆంధ్రజ్యోతి యాజమాని వేమూరి రాధాకృష్ణపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన వాయిస్ ను డబ్బింగ్ చేసి ఏబీఎన్ ఛానల్ లో తప్పుడు [more]
ఆంధ్రజ్యోతి యాజమాని వేమూరి రాధాకృష్ణపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన వాయిస్ ను డబ్బింగ్ చేసి ఏబీఎన్ ఛానల్ లో తప్పుడు కథనం ప్రసారం చేసి తన పరువుకు భంగం కలిగించారని, తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయ సలహా తీసుకున్న పోలీసులు ఇవాళ రాధాకృష్ణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ తప్పుడు కథనాలు, దుష్ర్పచారం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉందని విజయసాయిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన గొంతు కాదని ఖండించినా శనివారం మళ్లీ చర్చా కార్యక్రమం పెట్టి తన పరువుకు భంగం కలిగించారని, చర్చలో పాల్గొన్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు.