బోటు ప్రమాదానికి కారణమిదే
గోదావరి బోటు ప్రమాదానికి కారణం డ్రైవర్ కు అనుభవం లేకపోవడమేనని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ తెలిపారు. గోదావరి టోటు ప్రమాదంపై పోలీసు విచారణ చేపట్టారు. గోదావరిలో [more]
గోదావరి బోటు ప్రమాదానికి కారణం డ్రైవర్ కు అనుభవం లేకపోవడమేనని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ తెలిపారు. గోదావరి టోటు ప్రమాదంపై పోలీసు విచారణ చేపట్టారు. గోదావరిలో [more]
గోదావరి బోటు ప్రమాదానికి కారణం డ్రైవర్ కు అనుభవం లేకపోవడమేనని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ తెలిపారు. గోదావరి టోటు ప్రమాదంపై పోలీసు విచారణ చేపట్టారు. గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉందని తెలిసి కూడా ఎడమవైపు వెళ్లాల్సి ఉండగా మధ్యలోకి బోటు తీసుకెళ్లారన్నారు. పోలీసులు తనిఖీ చేసినప్పుడు అందరూ లైఫ్ జాకెట్లు వేసుకున్నారని, తర్వాత బోటు సిబ్బందే లైఫ్ జాకెట్లు తీసివేయవచ్చని ప్రయాణికులకు తెలిపారని ఎస్పీ చెప్పారు. బోటులో ముగ్గురు పిల్లలు, 64 మంది పెద్దలు ఉన్నారన్నారు. ఎనిమిది మంది బోటు సిబ్బంది ఉన్నారని తెలిపారు. బోటు ప్రమాదానికి పోలీసుల నిర్లక్ష్యం కారణం కాదని చెప్పారు. బోటు యజమాని వెంకటరమణతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.