Sun Dec 22 2024 07:30:28 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య జరిగిందిలా.. సీబీఐ ఛార్జిషీట్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఛార్జి షీటు వేసింది
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఛార్జి షీటు వేసింది. ఈ హత్యకు నలభై కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. హత్యకు దారి తీసిన పరిస్థితులు, అందుకు గల కారణాలు వంటి వాటిని సీబీఐ తన ఛార్జి షీటులో స్పష్టంగా పేర్కొంది. సీబీఐ ఛార్జిషీటులో వివరాలు ఇలా ఉన్నాయి. హత్యకు పకడ్బందీ ప్లాన్ జరిగినట్లు సీబీఐ స్పష్టం చేసింది. దారుణ హత్యకు గల కారణాలు ఇవీ అని ఛార్జిషీట్ లో పేర్కొంది.
నలభై కోట్ల డీల్...
దస్తగిరికి ఎర్రగంగిరెడ్డి రూ.5 కోట్లు ఆఫర్ చేసినట్లు స్పష్టం చేసింది. ఎర్ర గంగిరెడ్డి ఆదేశాలతో వివేకా హత్యకి గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్ ప్లాన్ వేశారని సీబీఐ తన చార్జిషీట్లో తెలిపింది. సీబీఐ చార్జిషీట్లో ''వివేకా హత్యకి ప్లాన్ చేసిన 5 రోజుల తర్వాత షేక్ దస్తగిరి రూ.కోటి అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ డబ్బుతో విల్లాలు కొనుగోలు చేయాలనుకున్నాడు. బెంగళూరులో ల్యాండ్ సెటిల్మెంట్లో వచ్చిన రూ.8 కోట్లలో వాటా ఇవ్వకపోవడంతో వివేకాపై కక్ష పెంచుకున్నాడు. డ్రైవర్ విధుల నుంచి తొలగించడంతో వివేకాపై కక్ష పెంచుకున్న దస్తగి పులివెందుల బకరాపురంలోని వివేకా నివాసంలో అర్ధరాత్రి హత్య చేసినట్టు నిందితుల స్టేట్మెంట్ ఇచ్చారని సీబీఐ ఛార్జి షీట్ పేర్కొంది.
హత్య తర్వాత...
హత్య తర్వాత వివేకా ఇంటికి సన్నిహితులతో కలిసి ఎంపీ అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి వివేకా ఇంటికి చేరుకున్నారని, బాత్రూంలో రక్తపు మడుగులో ఉన్న వివేకాను చూసిన అవినాష్‌రెడ్డి. వివేకా గుండెపోటుతో మరణించారని అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డి ప్రచారం చేశారని పేర్కొంది. ఎవరికీ అనుమానం రాకుండా వివేకా బెడ్రూం, వస్తువులను ఎర్రగంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, శుభ్రం చేశాడు. వివేకాకు అయిన గాయాలకి కట్టుకట్టి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు నిందితులు ఒప్పుకున్నారని పేర్కొంది. వివేకానంద రెడ్డి ఒంటిపై ఏడు గాయాలున్నట్లు విచారణలో వెల్లడించారు. మెదడుపై బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు డాక్టర్ రిపోర్ట్ ఉంది.'' అని సీబీబఐ అధికారులు పేర్కొన్నారు.
ఆధారాలను...
వివేకా హత్య కేసులో పోస్టుమార్టం చేసిన వైద్యులని విచారించినట్లు చార్జిషీట్లో సీబీఐ అధికారులు తెలిపారు. బలమైన గాయాలు ఉండడంతో వివేకా మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆయుధాలతో దాడి చేయడం వల్లే గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపినట్లు సీబీఐ అధికారులు ఛార్జిషీట్లు తెలిపారు. ''వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి చంపారు. వివేక పక్కా ప్రణాళికతో జరిగింది. ఎర్ర గంగిరెడ్డి ,దస్తగిరి ,యాది సునీల్, ఉమా శంకర్ రెడ్డి హత్యలో భాగం అయ్యారని పేర్కొంది. వ్యక్తిగత కక్షలు, ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని, ఎర్ర గంగిరెడ్డి , అతని సన్నిహితులు పడక గది శుభ్రం చేయడం ద్వారా కొన్ని క్లూస్ మిస్ అయ్యాయని తెలిపింది. కాంపౌండర్ గజ్జల జయప్రకాష్ రెడ్డి వివేకకు అయినగాయాలను శుభ్రం చేశారని, పథకం ప్రకారం మృతదేహాన్ని తరలించడంలో శంకర్ రెడ్డి, గంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ అధికారులు ఛార్జిషీట్లో వెల్లడించారు.
తప్పుడు ప్రచారం....
వివేకానంద రెడ్డి బెడ్ రూమ్‌ను శుభ్రం చేయాలని పని మనిషిపై శివశంకర్‌రెడ్డి బలవంతం చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న వైఎస్ ప్రతాపరెడ్డి చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి రక్తపువాంతులు, గుండెపోటు కారణంగా చనిపోయారు అని నమ్మించే ప్రయత్నం చేశారని ఛార్జిషీట్లో తెలిపారు. ''వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్లు శివ శంకర్ రెడ్డి మీడియాకు తెలిపారు.. రక్తపు మడుగులో ఉన్న వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత కూడా అతని కుమార్తె సునీత,ఆమె భర్తకు సమాచారం ఇవ్వలేదు. వివేకానంద రెడ్డికి గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు నమ్మించే ప్రయత్నం చేశారు. నిందితులు అందరూ కలిసి తాము చెప్పినట్లు కేసును రిజిస్టర్ చేయాలని సీఐ శంకరయ్యపై ఒత్తిడి తీసుకు వచ్చారని, వివేకానంద రెడ్డి వాచ్‌మెన్‌ను ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెదిరించారని, తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చినట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.'' అని చార్జిషీట్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు.
Next Story