Sun Jan 12 2025 05:37:44 GMT+0000 (Coordinated Universal Time)
బాబు నో చెప్పినా..ఏపీలోకి ఎంటర్ అవుతున్న సీబీఐ..!
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ త్వరలోనే ఎంటర్ కానుంది. విజయవాడలో అప్పట్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో విచారణ సమగ్రంగా జరగలేదని ఆమె తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో సిట్ విచారణ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో సీబీఐ వెంటనే సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ లోకి సీబీఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసకోవాలంటూ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం సంచలన జీఓ జారీ చేసింది. మరి, కోర్టు ఉత్తర్వులపై సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో చూడాలి.
Next Story