Fri Dec 20 2024 07:17:24 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్
వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. భాస్కర్‌రెడ్డి భార్య బాగ్యలక్ష్మికి అరెస్ట్ సమాచారాన్ని సీబీఐ అధికారులు ఇచ్చారు. పులివెందులకు ఈరోజు ఉదయం వెళ్లిన సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
వైఎస్ హత్యకేసులో....
వైఎస్ వివేకాహత్య కేసులో నిందితుడిగా భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అనుమానించి అరెస్ట్ చేశారు. ఆయన ఫోన్ ను కూడా సీజ్ చేశారు. పులివెందుల నుంచి వైఎస్ భాస్కర్‌రెడ్డిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్ చేశారన్న సమాచారంతో పెద్దయెత్తున ఆయన అనుచరులు, అభిమానులు పులివెందులలోని ఆయన ఇంటి వద్దకు చేుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం సీబీఐ కోర్టు మెజస్ట్రేట్ వద్ద వైఎస్ భాస్కర్‌రెడ్డిని హాజరుపర్చే అవకాశముంది.
Next Story