Tue Dec 24 2024 14:14:40 GMT+0000 (Coordinated Universal Time)
Bank Jobs : పది పాసైతే చాలు.. ఈ బ్యాంకు జాబ్స్ మీకోసం..
మీరు పది పాసయ్యారా. అయితే ఈ బ్యాంకు ఉద్యోగానికి అప్లికేషన్ వేసేయండి.
Bank Jobs : బ్యాంకు జాబ్స్ సంపాదించడం కోసం ప్రతి ఒక్కరు ఎంతో కష్ట పడుతుంటారు. కొందరు అయితే ఆ జాబ్స్ రావాలంటే పెద్ద డిగ్రీలు ఉండాలని అనుకుంటుంటారు. అయితే 10వ తరగతి చదివిన వారికీ కూడా బ్యాంకు ఉద్యోగాలు ఉన్నాయి. మీరు పది పాసయ్యారా. అయితే ఈ ఉద్యోగానికి అప్లికేషన్ వేసేయండి.
సఫాయికరంచారి కం సబ్ స్టాప్ ఉద్యోగాల భర్తీ కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబ్ కి ఎంపిక అయిన వారికి భారత్ లోని పలు బ్రాంచ్ ల్లో పోస్టింగ్స్ ఉంటాయి. 18-26 మధ్య వయసు ఉన్న వారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. రూ.14,500-28,145 వరకు జీతం ఉంటుంది.
ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి అప్లికేషన్ కోసం ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులు రూ.175, జనరల్ అభ్యర్థుlu రూ.850 ఫీజ్ చెల్లించాల్సి ఉంది. అప్లికేషన్ కి చివరి తేదీ 2024 జనవరి 9. ఎగ్జామ్ ఫిబ్రవరి లో జరిగే అవకాశం ఉంది. కాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలకు ఉన్న ఖాళీల సంఖ్యని ఒకసారి గమనించండి. మిజోరం, పూణే-118, పాట్నా-96, లక్నో-78, అహ్మదాబాద్-76, ఢిల్లీ-76, భోపాల్-38, కోల్ కత్తా-2. ఈ జాబ్ గురించిన మరిన్ని వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.httsps://centralbankofindia.Co.in/en/recruitments
Next Story