Breaking : మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ గా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు, తెలంగాణ ఆరు ఎమ్మెల్సీ [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ గా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు, తెలంగాణ ఆరు ఎమ్మెల్సీ [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ గా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు, తెలంగాణ ఆరు ఎమ్మెల్సీ స్థానాలను నిర్వహించనుంది. నవంబరు తొమ్మిదవ తేదీన నోటిఫికేషన్ ఈ ఎన్నికల కు విడుదల కానుంది. నవంబరు 29న పోలింగ్, కౌంటింగ్ ను నిర్వహిస్తారు. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్సీ పదవీకాలం ఏపీలో మే 31వ తేదీన, తెలంగాణలో జూన్ 3తో ముగిసింది.
అన్నీ అధికార పార్టీకే…
ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఈ ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీకే దక్కనున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్య తెలంగాణలో టీఆర్ఎస్ కు, ఏపీలో వైసీపీకి అధికంగా ఉండటంతో ఈ ఎన్నికలు అధికార పార్టీల నేతలనే వరిస్తాయి. రెండు రాష్ట్రాల్లో విపక్షాలు పోటీకి దించే అవకాశాలు లేవు.