Sun Dec 22 2024 22:41:47 GMT+0000 (Coordinated Universal Time)
సిద్ధిపేట జిల్లాకు మరో అవార్డు ప్రకటించిన కేంద్రం
వివిధ కారణాలతో వ్యాక్సిన్లు వేయించుకోని చిన్నారులను గుర్తించి, వారందరికీ అధికారులు, సిబ్బంది వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.
సిద్ధిపేట : సిద్ధిపేట జిల్లాను మరో అవార్డు వరించింది. జిల్లాలో చిన్నారులకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయడమే లక్ష్యంగా ప్రారంభించిన మిషన్ ఇంద్ర ధనుష్ సక్సెస్ అయింది. వివిధ కారణాలతో వ్యాక్సిన్లు వేయించుకోని చిన్నారులను గుర్తించి, వారందరికీ అధికారులు, సిబ్బంది వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం.. 'మిషన్ ఇంద్ర ధనుష్' కేటగిరీలో సిద్దిపేట జిల్లాను ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ -2019 కి ఎంపిక చేసింది.
ఏప్రిల్ 21న ఢిల్లీలో జరిగే 'సివిల్ సర్వీసెస్ డే' కార్యక్రమంలో ట్రోపీతో పాటు రు.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాకు అందించనుంది. జిల్లాకు ఈ అవార్డు రావడంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ లో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.
Next Story