Wed Dec 25 2024 15:26:57 GMT+0000 (Coordinated Universal Time)
ఎల్వీకి కేంద్రం అండ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అవమానకరంగా బదిలీ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అవమానకరంగా బదిలీ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అవమానకరంగా బదిలీ చేయడంపై బీజేపీ పెద్దలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అవసరమైతే కేంద్ర సర్వీసుల్లో తీసుకోవాలని కూడా బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ బాధ్యతలను అప్పగించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ప్రచారం మాత్రమేనని కొందరు వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
Next Story