Mon Dec 23 2024 15:42:17 GMT+0000 (Coordinated Universal Time)
రేపే రూ.75 నాణెం విడుదల.. ఎలా పొందాలి ?
మరో వైపున నూతన పార్లమెంట్ భవన ప్రాంగణం, ప్రతిమతో పాటు 2023 అంకెలు ఉంటాయి. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంతో పాటు..
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ రేపు (మే28) రూ.75 నాణేన్ని విడుదల చేయనుంది. భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో నిర్దేశించిన నిర్దేశాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ 35-గ్రాముల నాణెం భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో నిర్వచించే ఘట్టాన్ని స్మరించుకోవడానికి ప్రతీకగా ఉండబోతోంది. నూతన పార్లమెంట్ స్మారణ నాణెం రూపకల్పన ఆసక్తికరంగా ఉంది. ఈ నాణెం ముఖంపై కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎంతో అద్భుతంగా చెక్కారు.
రూ.75 నాణేనికి ఒకవైపున అశోకచక్రం, సింహం, మధ్యలో దేవనాగరి లిపిలో భారత్ అని, ఇంగ్లీష్ లో ఇండియా అనే పదాలు ఉంటాయి. మరో వైపున నూతన పార్లమెంట్ భవన ప్రాంగణం, ప్రతిమతో పాటు 2023 అంకెలు ఉంటాయి. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంతో పాటు.. దేశ స్వాతంత్య్ర సిద్ధికి ప్రతీకగా కూడా నిలుస్తుంది. అయితే మరి ఈ నాణేన్ని ఎలా పొందాలి ? అన్నదే అందరికీ ఉండే సందేహం.
రూ.75 నాణెం స్మారకంగా ముద్రిస్తోన్న నాణెం. కాబట్టి వీటి ముద్రణ పరిమిత సంఖ్యలో ఉంటుంది. నాణేలను కేంద్రం ముంబై, కోల్కతా, హైదరాబాద్, నోయిడాలలో ఉన్న నాలుగు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల ద్వారా ఉత్పత్తి చేయనుంది. ఈ నాణేలను కొనుగోలు చేయాలనుకునేవారు కోల్కతా మింట్, ముంబై మింట్ మరియు హైదరాబాద్ మింట్ వెబ్సైట్లను సందర్శించవచ్చు. అమ్మకానికి అందుబాటులో ఉన్న నాణేలు మరియు వాటి సంబంధిత ధరల గురించిన సమాచారం సరిచూసుకుని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
Next Story