22న భవిష్యత్ కార్యాచరణ
నలభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నా దేశం కోసం ఇప్పుడు ఆ పార్టీతో కలుస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అమరావతి వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి దేశాన్ని బ్రష్ఠు పట్టించారని, వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. మాట వినని వారిపైకి ఈ వ్యవస్థలను ఉసిగొల్పుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
త్వరలోనే వేదికకు తుదిరూపం....
అత్యున్నత సంస్థ అయిన సీబీఐ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. యాంటీ బీజేపీ వేదికను ఏర్పాటుచేసేందుకు ఇప్పటికే ప్రయత్నం ప్రారంభించామని, త్వరలోనే ఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో తానేమీ ఆశించడం లేదని, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈనె 22న బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామనిచెప్పారు. దేశాన్ని రక్షించుకోవడం కోసం అన్ని పార్టీలను ఏకం చేసే తన ప్రయత్నం సఫలమవుతుందన్నారు. మోడీ చెబితే వినరని, ఆయన పంథా ఆయనేదనన్నరారు. తాను రాజకీయ అవసరాల కోసం కాంగ్రెతో కలవలేదన్నారు. ప్రజాస్వామ్యాన్నికాపాడుకునేందుకే యాంటీ బీజేపీ కూటమిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.