Sat Jan 11 2025 13:45:02 GMT+0000 (Coordinated Universal Time)
భయపడొద్దు... మనకు కాంగ్రెస్ అండగా ఉంది..!
హైదరాబాద్ లో ఉన్న వారికి ఇక నుంచి ఏ భయమూ అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... నరేంద్ర మోదీ ఐటీ దాడులు చేస్తాడని, కేసీఆర్ ఇంకేదో చేస్తారని ఎవరూ భయపడవద్దని.. మనకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ ది దివాళాకోరుతనమని, టీఆర్ఎస్ నేత తిట్ల పురాణానికి భయపడేది లేదన్నారు. నాలుగున్నరేళ్లలో హైదరాబాద్ కి కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కేసీఆర్ కంటే వెయ్యి రెట్లు మెరుగైన పాలన ఇస్తామని హామీ ఇచ్చారు.
Next Story